మహిళా పోలీసుల కోసం మెడికల్ క్యాంపు
ప్రారంభించిన ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసుల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మ్యాక్సీ విజన్ కంటి వైద్యశాల డాక్టర్ రామలింగారెడ్డి, కొండవీడు ఈఎన్‌టీ హాస్పిటల్, గాయత్రి స్కిన్ కేర్ వైద్యశాల, లిఖిత ఆర్థో వైద్యశాల, హన్విత జనరల్ వైద్యశాల, వసంత డెంటల్ కేర్ వైద్యశాల, హిమబిందు గైనిక్ వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొని 151 మంది మహిళా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదనపు ఎస్పీ (పరిపాలన) జేవీ.సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, వెల్ఫేర్, అడ్మిన్, హోంగార్డు ఆర్‌ఐలు గోపీనాథ్, రాజా, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment