జిల్లా సైన్స్ క్విజ్ పోటీలో ద్వితీయ స్థానం
నరసరావుపేటరూరల్: జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలలో ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్ధులు ద్వితీయ స్ధానం సాధించినట్టు పాఠశాల ప్రధానోపాద్యాయుడు కె.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా స్ధాయి సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో జిల్లాలోని 20 పాఠశాలల నుంచి టీమ్‌లు పాల్గొన్నాయని వివరించారు. పాఠశాల విద్యార్ధులు టీవీ కల్యాణ్, వర్షిత, మహాలక్ష్మీలు పోటీలో పాల్గొని ప్రతిభ కనభర్చి ద్వితీయ స్ధానం పొందారని తెలిపారు. విద్యార్ధులను శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాద్యాయుడు శ్రీనివాసరావు, సైన్స్ ఉపాద్యాయుడు ఏఏ మదుకుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment