కార్మిక శాఖ అధికారిని అంటూ వ్యక్తి హల్‌చల్
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో సహాయ కార్మిక శాఖ అధికారిని అంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పట్టణంలోని పలు దుకాణాల వద్దకు ఓ వ్యక్తి శుక్రవారం వెళ్లి సహాయ కార్మిక శాఖ అధికారిగా పరిచయం చేసుకుని లైసెన్స్ రెన్యూవల్ పేరిట పలు షాపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే అతడిని నకిలీ అధికారిగా గుర్తించిన వ్యాపారులు కార్మిక శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. తమ శాఖ తరఫున ఎలాంటి లైసెన్స్ రెన్యూవల్ చేయడం లేదని వారు చెప్పడంతో వ్యాపారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శుక్రవారం రాత్రి షాపుల వద్దకు చేరుకొని వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ముప్పాళ్లకు చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు. మూడు రోజులుగా పట్టణంలోని పలు దుకాణాల వద్ద రూ.వెయ్యి నుంచి అందినకాడికి దండుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. మాచర్ల, పిడుగురాళ్ల, తదితర మున్సిపాలిటీలలోనూ వెంకయ్య వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment