పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Mon, Mar 3 2025 2:13 AM | Last Updated on Mon, Mar 3 2025 2:12 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
అన్ని డబ్బులెక్కడివని ‘సాయిసాధన’ బాధితులకే ఎదురు ప్రశ్నలు

7

మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ట

కొల్లూరు: మండలంలోని చినపులివర్రు శివారు గురివిందపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామ దేవత మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు.

గుంటూరు రేంజ్‌కు 53 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు

నగరంపాలెం: సమర్థంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ప్రొబేషనరీ ఎస్‌ఐలకు సూచించారు. శిక్షణ పూర్తయి, గుంటూరు రేంజ్‌ పరిధిలో విధుల నిర్వహించేందుకు ఎంపికై న 53 (36 మంది పురుషులు, 17 మంది మహిళలు) మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు గుంటూరు నగరంలోని గుంటూరు రేంజ్‌ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు. తద్వారా పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలన్నారు. అనంతరం వారికి జిల్లాలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను ఐజీ అందించారు. గుంటూరు జిల్లాకు 22 మంది, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతి జిల్లాకు నలుగురిని కేటాయిస్తూ నియామక ఉత్తర్వులు అందించారు. ఈనెల 2 నుంచి 6 వ తేదీ వరకు పీఎస్‌ఐలకు సెలవులని ఐజీ తెలిపారు. అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేహౌండ్స్‌ శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అనంతరం పీఎస్‌ఐలతో కూడా ఐజీ ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇఫ్తార్‌ సహరి

(సోమ) (మంగళ)

నరసరావుపేట 6.13 5.10

గుంటూరు 6.22 5.10

బాపట్ల 6.21 5.08

పెద్దల హస్తంపై

అనుమానాలు

పుల్లారావు విషయంలో మొదటి నుంచీ పోలీసు శాఖలోని పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పెద్దలూ అతనికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నుంచీ పరిశీలిస్తే పుల్లారావు మోసాల చిట్టా బయట పడిన నెల తర్వాతగానీ ఆయన కోర్టులో లొంగిపోలేదు. ఈలోగా ప్రజల నుంచి దోచిన సొమ్మంతా వివిధ రూపాల్లో దారి మళ్లించాడు. పుల్లారావును అరెస్టు చేసి, దోచుకున్న సొమ్ము రికవరీ చేయడంపై పోలీసులు దృష్టి సారించలేదు. దీని వెనుక పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బాధితులు మండిపడుతున్నారు. సుమారు వెయ్యి మంది బాధితులు ఉంటే ప్రభుత్వం ఆర్థిక నేరగాడైన పుల్లారావుకు లబ్ధి చేకూరేలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదెలా పారదర్శక పాలన అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇచ్చిన మొత్తం తిరిగి వస్తుందో రాదో.. ఎవరికి చెబితే వేదన తీరుతుందో.. అనే దిగులుతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సాయిసాధన చిట్‌ఫండ్‌ బాధితులకు సీఐడీ షాక్‌ ఇస్తోంది. ఉన్న కొద్దిపాటి ఆశలను ఆదిలోనే సమాధి చేస్తూ సీఐడీ అధికారులు అడిగే ప్రశ్నలు బాధితుల గుండెల్లో మరింత వేదన మిగులుస్తున్నాయి. అయ్యా.. కష్టపడి రూపాయి రూపాయిగా కూడబెట్టుకున్న డబ్బులను వడ్డీ ఆశతో పుల్లారావుకు ఇస్తే నిండా మునిగిపోయామని చెప్పేలోగానే అధికారులు వారి అసలు నైజం చాటుతున్నారు. పోయిన డబ్బుల సంగతి సరే.. అసలు మీకు అంత మొత్తం ఎలా వచ్చాయి.. వాటికి లెక్కలు చెప్పండి.. అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బాధితులు చేసేది లేక అంతులేని వేదనతో వెనుదిరుగుతున్నారు. ఇదేం అన్యాయమంటూ గుండెలు బాదుకుంటున్నారు. చీటర్‌కే అనుకూలంగా వ్యవహరిస్తున్న నిస్సిగ్గు సీఐడీ, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నరసరావుపేట టౌన్‌: రెండు నెలల క్రితం గుంటూరు, పల్నాడు జిల్లాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా సంచలనం సృష్టి్‌ంచిన సాయిసాధన చిట్‌ఫండ్‌ పాలడుగు పుల్లారావు స్కాం కేసులో బాధితుల వేదన అంతా ఇంతా కాదు. అధిక వడ్డీ ఆశ చూపి, లేని ఆస్తులు ఉన్నట్లు మాయ చేసి సుమారు వెయ్యి మంది వద్ద రూ.400 కోట్లకుపైగా పుల్లారావు వసూలు చేశాడు. ఈ నగదుతో రాత్రికి రాత్రే కుటుంబంతో ఉడాయించాడు. బాధితులు ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు. కమిటీగా ఏర్పడి పుల్లారావు ఆస్తులెంత.. అప్పులెంత ? అంటూ ఆరా తీశారు. ఇప్పటికే ఎమ్మెల్యే అరవింద్‌ బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవి, హోంమంత్రి అనితలను సైతం కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఐడీకి కేసు అప్పగించవద్దంటూ విన్నవించుకున్నారు. ఎవరికి వారు తాము అండగా నిలబడతామని చెప్పారేగానీ.. బాధితులను న్యాయం చేసే దిశగా మాత్రం చర్యలు శూన్యం. బాఽధితులు భయపడినట్టే కేసు చివరకు సీఐడీకి చేరింది. అయినప్పటికీ న్యాయం జరిగే అవకాశాలు లేకపోవడంతో ఆదివారం నరసరావుపేటలోని ఓ హోటల్‌లో బాధితులంతా సమావేశమై పలు తీర్మానాలు చేశారు. పుల్లారావు స్కాంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యే అరవింద్‌ బాబును కలసి విన్నవించారు.

ఆ డబ్బులకు లెక్కలు చెప్పండి..

కూటమి ప్రభుత్వం ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా పుల్లారావు కేసును నీరుగార్చేలా సీఐడీకి అప్పగించింది. సీఐడీ బాపట్ల ఎస్పీ తుషార్‌తో కలసి ఒక సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సీఐడీకి బదిలీ అయ్యాక 15 రోజులకుగానీ బాధితులతో సిట్‌ అధికారులు మాట్లాడలేదు. సీఐడీ బృందం ఒక్కసారి కూడా నరసరావుపేటలోని సాయిసాధన చిట్‌ఫండ్‌కు వచ్చి తనిఖీలు చేపట్టలేదు. బాధితులను మాత్రం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌, గుంటూరు సీఐడీ కార్యాలయానికి పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. అక్కడ తమనే దోషుల్లాగా చూస్తూ సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. అసలు పుల్లారావుకు ఇచ్చేందుకు మీకు డబ్బులు ఎలా వచ్చాయో లెక్కలు చెప్పండంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. దీంతో బాధితులు ఇదెక్కడి దారుణమంటూ బోరున విలపిస్తున్నారు. సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో బాధితులు వారి వద్దకు వెళ్లేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఉన్న కష్టాలకు తోడు కొత్త సమస్యలు వస్తాయేమోనన్న ఆలోచనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేస్తారని ఆశించి వస్తే ఇదేం తీరని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

దర్జా అంటే పుల్లారావు కుటుంబానిదే..

పుల్లారావుకు చెందిన సాయిసాధన చిట్‌ఫండ్‌తోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో కూడా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, అత్తమామలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ చీటింగ్‌ వ్యవహారంలో వీరంతా దోషులే. అయితే పుల్లారావు కోర్టులో లొంగిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆయన కుటుంబ సభ్యులపై కనీస చర్యలు కూడా లేవు. వీరంతా ప్రజల సొమ్ముతో దర్జాగా బయట తిరుగుతున్నారు. పుల్లారావుతోపాటు అతని కుటుంబసభ్యులపై నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వడంతో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారిని అరెస్ట్‌ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బాధితులు బోరున విలపిస్తుంటే.. పుల్లారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎంచక్కా దర్జాగా తిరుగుతున్నారు.

జిల్లాల వారీగా కేటాయింపులు నియామక ఉత్తర్వులు అందించిన రేంజ్‌ ఐజీ

న్యూస్‌రీల్‌

పుల్లారావు కేసు విషయంలో దారుణంగా సీఐడీ ధోరణి మోసపోయిన మొత్తం వదిలేసి.. ఎలా వచ్చాయంటూ నిలదీత ఇదెక్కడి తీరంటూ గుండెలు బాదుకుంటున్న బాధితులు పుల్లారావుకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం ఆయన కుటుంబంపైనా ఇప్పటివరకు చర్యలు లేవంటూ ఆవేదన పుల్లారావు స్కాంపై అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేకు వినతి

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/11

పల్నాడు

పల్నాడు2
2/11

పల్నాడు

పల్నాడు3
3/11

పల్నాడు

పల్నాడు4
4/11

పల్నాడు

పల్నాడు5
5/11

పల్నాడు

పల్నాడు6
6/11

పల్నాడు

పల్నాడు7
7/11

పల్నాడు

పల్నాడు8
8/11

పల్నాడు

పల్నాడు9
9/11

పల్నాడు

పల్నాడు10
10/11

పల్నాడు

పల్నాడు11
11/11

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement