గుంటూరు జిల్లాలోని 87 కేంద్రాల్లో హాజరు కానున్న 35,946 మంది
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 35,946 మంది విద్యార్థులకు 87 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించిన తరువాత, 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు పరుస్తోంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా, ఏసీ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులకు పక్కనే ఉన్న ఏసీ లా కళాశాల ద్వారం నుంచి పరీక్ష కేంద్రంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment