కూటమి ప్రభుత్వానిది దగా బడ్జెట్
జె.పంగులూరు: ఎన్నో మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, తప్పించుకునే వీల్లేక, రాష్ట్ర ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పి పుచ్చేందుకు చివరికి ఒక దగా బడ్జెట్ ప్రకటించిందని రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చందోలు రాజ్‌కుమార్ దుయ్యబట్టారు. మండల పరిధిలోని పంగులూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్న పథకం ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం అభాసు పాలైందని, అనేక కారణాలతో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గించే విధంగా చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.10 లక్షలు, ప్రతి మహిళకు రూ.1500 సంగతి ఎటు పోయిందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడకి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికే రూ. లక్ష కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం మరో రూ.80 వేల కోట్లు తీసుకురావాలని ప్రకటించడం సంపద సృష్టిలో భాగమా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి
చందోలు రాజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment