పెనుమాకకు ‘సాహితీ రత్న’ ప్రదానం
అద్దంకి రూరల్: ప్రముఖ కవి పెనుమాక నాగేశ్వరరావుకు సాహితీ మిత్రమండలి సాహతీ రత్న బిరుదును ప్రదానం చేసింది. ఆదివారం స్థానిక చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవాసదన్‌లో సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లక్కరాజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి పెనుమాక నాగేశ్వరరావు రచనలపై పాలపర్తి జ్యోతిష్మతి, కుందుర్తి స్వరాజ్యపద్మజ విశ్లేషించారు. పెనుమాక నాగేశ్వరరావు మాట్లాడుతూ తానురచించిన నాన్న నువ్వు సున్నానా, ఫారెన్‌సెంటు, బార్‌తం, నైతరుణి, ఆలయం, దేవుడిపాట నవల గురించి వర్ణించారు. కార్యక్రమంలో యు. దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, ఎ.లెవీ ప్రసాద్, ఆర్‌వీ రాఘవరావు, చందలూరి నారాయణ, పీసీ మెచ్ కోటయ్య, ఎల్.శివరావు, చప్పిడి వీరయ్య, ఎల్.శ్రీనివాసరావు, చుండూరి మురళీ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment