సత్తెనపల్లి: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మిరపకాయల కోతలకు ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన 40 మంది కూలీలు నెల క్రితం వచ్చి గుడారాలు వేసుకొని జీవనం వెళ్లదీస్తున్నారు. కూలీలలో ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో కుమార్తె ఇడ్లీ తెచ్చేందుకు సిద్ధమైంది. కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన హనిమిరెడ్డి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆ యువతిని ఎక్కించుకొని వెళ్లాడు. ఇడ్లీ తీసుకొని తిరిగి వస్తుండగా వాహనం నడుపుతూనే వెనుక కూర్చున్న యువతిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. గుడారాల వద్ద కాకుండా మరికొంత ముందుకు తీసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. గుడారాల వద్దకు చేరుకొని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి విలపించింది. గ్రామ పెద్దలు వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment