చెరుకుపల్లి: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన మండలంలోని ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం అదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల వయసు గల ఓ మైనర్ బాలుడు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె వెంటనే తెనాలి ఏరియా హాస్పిటల్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై స్థానిక ఎస్‌ఐను సంప్రదించగా చిన్నారి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment