వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
గురజాల: నగర పంచాయతీలోని జంగమహేశ్వరపురంలో పలనాటి తిరుమలగా పేరుగాంచిన శ్రీ అలమేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. తొలుత దేవాలయ ప్రాంగణంలోని కల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మండపంలో అలమేలు మంగా పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని వేదపండితులు కారెంపూడి వరదాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు దంపతులు ఈ మహోత్సవంలో పీట్లపై కూర్చున్నారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నసంతర్పణ, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. మరోవైపు స్వామి వారి 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయంలో హోమం, బలిహరణంతో పాటుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎదురు కోల, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
Comments
Please login to add a commentAdd a comment