
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 3వతేదీ నుంచి ప్రారంభం కానుంది. పట్టణంలోని కేబీఆర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పల్నాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండేలా కేబీఆర్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఈనెల 3 నుంచి 9వతేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగనున్న కేంద్రంలో దాదాపు 1.75 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకు గాను 121 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 726 మంది ఎగ్జామినర్లు, 242 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో పాల్గొంటున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈఓ, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా డిప్యూటీ డీఈఓలు వ్యవహరించనున్నారు. ఎగ్జామినర్లు ప్రతిరోజు 40 పేపర్లు మూల్యాంకనం చేయనుండగా, వాటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలించిన అనంతరం వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలిస్తారు. అలాగే డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు రోజుకు 45 చొప్పున, క్యాంప్ ఆఫీసర్ 20 చొప్పున మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. కాగా, మూల్యాంకన కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మూల్యాంకనం పూర్తయ్యే వరకు వైద్య సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ కేంద్రం వద్ద ఉండేలా చర్యలు తీసుకున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 518.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది.
విధుల్లో 1089 మంది సిబ్బంది

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం