
రంగస్థల ప్రియులకు పండుగ
ఈసారి నాటికల పోటీలు రంగస్థల ప్రియులకు పర్వదినాలుగా మారనుంది. దాతలు, అతిథులు, కళాకారులకే కాదు గ్రామంలోని గడపగడకు ఆహ్వాన పత్రాలు, కూపన్లు ఇస్తున్నాం. ప్రదర్శనలకు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి రోజుకో వైరెటీ అల్పాహారం, రోజు 30 మంది చొప్పున 3 రోజులు లక్కీడ్రా తీసి 90 మందికి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నాం. ప్రతి నాటికను యూట్యూబ్, షోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. దీని ప్రత్యేక లింకును ప్రదర్శనకు 2గంటల ముందు అందరికీ చేరుస్తాం. నటీమణులకు సారెతో ఆడుపడుచు సత్కారం ఇస్తాం.
– డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం అధ్యక్షుడు