
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
రాజుపాలెం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎస్‌ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని కొండమోడు విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎస్‌ఈ మాట్లాడుతూ.. బిల్లుల వసూలులో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో టాన్స్‌ఫార్మర్ వద్ద లోడ్ బ్యాలెన్సు చేసుకోవాలని సూచించారు. 50 శాతం అదనపు లోడు సబ్సిడీ స్కీమును గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకుని వెంటనే బిల్లులు చెల్లించాలని తెలిపారు. గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగా ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా మండలంలోని రాజుపాలెం, గణపవరం, అనుపాలెం సబ్ స్టేషన్‌లలో తనిఖీలు చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ డీఈఈ బి.నాగసురేష్‌బాబు, మాచర్ల ఈఈ ఎన్. సింగయ్య, ఏఈఈ కోట పెదమస్తాన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.