
‘బర్డ్‌ఫ్లూ మృతి’ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే
నరసరావుపేట: బర్డ్‌ఫ్లూ వ్యాధితో రెండేళ్ల చిన్నారి ఆరాధ్య మృతి నేపథ్యంలో వెంటనే పల్నాడు జిల్లాను బర్డ్‌ప్లూ ఇన్‌ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలయ్యనగర్ ఒకటో లైనులో ఉండే ఆరాధ్య కుటుంబాన్ని కేంద్ర బృందం పరిశీలించే సమయంలో ఆయన కూడా అక్కడకు వచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పెండ్యాల గోపీ, జ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలిక బర్డ్‌ప్లూతో చనిపోవటం బాధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవయవాలు పనిచేయక పోవడం వల్ల బాలిక చనిపోయిందని నిర్ధారించారన్నారు. మొదటి బర్డ్‌ప్లూ కేసు 2021లో మహారాష్ట్రలో నమోదుకాగా, తిరిగి రెండో కేసు నరసరావుపేటలో నమోదు కావడం బాధాకరమైన విషయమన్నారు. ఈ పాపకు బర్డ్‌ప్లూ సోకిందనే విషయాన్ని దేశంలోని వైరాలజీ సంస్థ ఐసీఎంఆర్ నిర్ధారించగా, ఇది బర్డ్‌ప్లూ మరణం కాదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాను బర్డ్‌ఫ్లూ ఇన్‌ఫెక్షన్ సెంటర్‌గా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ఏరియాలో 10 కోళ్లు కూడా బర్డ్‌ఫ్లూ వ్యాధితో చనిపోయాయని చెబుతున్నారని, దీని మీద కూడా విచారణ చేయాలని అన్నారు.
వలంటీర్లు ఉంటే మేలు జరిగేది
గతంలో కరోనా సమయంలో వలంటీర్లు ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి ఏ ఇంట్లోనైనా జ్వరం, ఇతర వ్యాధి బాధితులు ఉంటే గుర్తించి వెంటనే చికిత్స పొందే ఏర్పాటు చేసేవారన్నారు. నరసరావుపేటలో చిన్నారి బర్డ్‌ప్లూ వ్యాధితో చనిపోతే ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, ఈ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి,, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, నాయకులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాను బర్డ్‌ఫ్లూ
ఇన్‌ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలి
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఎందుకు పర్యటించలేదు?
చిన్నారి కుటుంబానికి తక్షణమే
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
పాప మృతికి కారణం బర్డ్‌ఫ్లూ
కాదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదం
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
శ్రీనివాసరెడ్డి
బాధిత కుటుంబానికి ఆర్థిక
సహాయం అందజేత