
గీతామందిరం ఎదుట వైన్‌షాపు ఏర్పాట్లు దుర్మార్గం
సత్తెనపల్లి: పట్టణంలోని గార్లపాడు సెంటర్‌లో గల గీతామందిరం ఎదురు వైన్‌షాపు పెట్టాలనుకోవడం దుర్మార్గమని వాసవీ క్లబ్ వైస్ గవర్నర్, ఆర్యవైశ్య సంఘ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆత్మకూరి హరేరామ చెంచయ్య అన్నారు. పట్టణంలోని కట్టమూరివారి వీధిలోని ఆర్యవైశ్యులు శనివారం గీతామందిర్ దేవాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరేరామ చెంచయ్య మాట్లాడుతూ పట్టణంలోని పాత గ్రంథాలయం పక్కనే ఎప్పటినుంచో గీతా మందిరం దేవాలయం ఉందని దానికి ఎదురుగా నూతన మద్యం దుకాణం ఏర్పాటుకి పనులు చేస్తున్నారన్నారు. అక్కడ మద్యందుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆర్డీఓ, ఎకై ్సజ్ సీఐ, తహసీల్దార్‌లకు మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరాదంటూ వినతి పత్రం ఇచ్చామన్నారు. వైన్‌షాపు ఏర్పాటును మానుకోవాలని హితవు పలికారు. ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు అన్నం సుబ్రహ్మణ్యం, నాయకులు శ్రీను, రాధ కృష్ణ, గోపాల్, రాము, ఆర్‌కె, మహిళలు ఉన్నారు.
ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయొద్దు
వాసవీ క్లబ్ వైస్ గవర్నర్
ఆత్మకూరి హరేరామ చెంచయ్య