కూటమి కాదిది.. కుట్రల ప్రభుత్వం | - | Sakshi

కూటమి కాదిది.. కుట్రల ప్రభుత్వం

Apr 6 2025 2:37 AM | Updated on Apr 6 2025 2:37 AM

కూటమి కాదిది.. కుట్రల ప్రభుత్వం

కూటమి కాదిది.. కుట్రల ప్రభుత్వం

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిషోర్‌ భార్య సురేఖ

మాచర్ల రూరల్‌: ఇది కూటమి ప్రభుత్వం కాదని.. కక్షల, కుట్రల ప్రభుత్వమని సెలవులో ఉన్న మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురక కిషోర్‌ సతీమణి తురక సురేఖ ఆరోపించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన భర్త తురక కిషోర్‌ను ఒక కేసులో ఇరికించి నిందితుడిగా అదుపులోకి తీసుకొని బెయిల్‌ పై బయటకు వచ్చే సమయంలో అనేక కేసులు బనాయిస్తూ 90 రోజులకు పైగా రిమాండ్‌ ఖైదీగా ఉంచటం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేస్తున్న రాజకీయ నాయకుడిపై పీడీ యాక్టు ఎలా నమోదు చేస్తారని ఆమె ప్రశ్నించారు. బెయిల్‌పై బయటకు వస్తాడేమోనని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ కక్ష పూరిత ధోరణితో అనేక కేసులు పెట్టిందని, నాగార్జున సాగర్‌ కేసులో అక్రమంగా ఇరికించి తమ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. కూటమి నేతలు తన భర్త కిషోర్‌తో పాటు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న, జర్నలిస్టుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఇరువురు సోదరులపై కూడా అక్రమంగా కేసులు పెట్టారన్నారు. మూడు సంవత్సరాల చిన్నారి, ఆరు నెలల పాపతో తాను భర్త కోసం నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి జైళ్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్ధరాత్రిళ్లు ఇంటిపై దాడులు చేస్తున్నారు..

కుటుంబం చిన్నాభిన్నమైన పరిస్థితిలో వేరే చోట తలదాచుకుంటుంటే ఆ ఇంటిపై కూడా అర్థరాళ్లు గడ్డపారతో కిటికీలు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రాజకీయంగా రాగ ద్వేషాలుంటే అంతవరకే చూసుకోవాలని, తమ కుటుంబంపై దాడులు చేస్తూ, కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నకరికల్లు: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చల్లగుండ్ల సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం జరిగింది. సంఘనటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురజాల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన గోవిందరాజు(40) రోడ్డుపక్కన తన ద్విచక్ర వాహనాన్ని పెట్టి రోడ్డు దాటేందుకు నడిచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలయ్యాడు. 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి..

చిలకలూరిపేట టౌన్‌: విద్యుత్‌ షాక్‌కు వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన బాణావత్‌ భీమానాయక్‌ (52) గడియారస్థంభం సెంటర్‌లోని పలు షాపుల్లో వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. అబ్దుల్లా షాపులో పనిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement