
సాగర్ కాల్వలో దూకిన వృద్ధుడు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మునగాల సుబ్బారావు(63) అనే వృద్ధుడిని విజయపురిసౌత్ ఎస్‌ఐ మహమ్మద్ షఫీ తన సిబ్బందితో కలిసి కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సుబ్బారావు ఆదివారం సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్‌ఐ షఫీ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయంతో కొట్టు మిట్టాడుతున్న సుబ్బారావును తాళ్లు వేసి బయటకు తీశారు. సుబ్బారావు సురక్షితంగా బయటపడటంతో ఎస్‌ఐ షఫీ, ఏఎస్‌ఐ సోమలా నాయక్, కానిస్టేబుల్ సురేష్, గోపి, హనుమా నాయక్‌లను స్థానికులు అభినందించారు.
కాపాడి ఒడ్డుకు చేర్చిన పోలీసులు