
తీరప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయం
బాపట్లటౌన్: తీర ప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయమని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. మంగళవారం సూర్యలంక తీరంలోని మైరెన్ పోలీస్‌స్టేషన్‌లో సాగర్ కవచ్‌పై సిబ్బందికి మాక్‌డ్రిల్ నిర్వహించారు. కవచ్ నోడల్ ఆఫీసర్, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ తీరప్రాంత పరిరక్షణలో భాగంగా ఈనెల 9,10 తేదీల్లో సముద్ర తీరప్రాంతాల్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏడాదిలో రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సముద్రమార్గం గుండా ఎవరైనా చొరబాటుదారులు మన ప్రాంతానికి చేరుకుంటే వారిని ముందస్తుగా గుర్తించి వారిని సముద్రంలోనే ఏ విధంగా అడ్డుకోవాలనే అంశాలపై ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీసులతోపాటు తీరప్రాంతానికి చేరుకొని జనసంచారంలో అనుమానాస్పదంగా సంచిరిస్తుంటే వారిని ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై సివిల్ పోలీసులకు పలు సూచనలు చేశారు. మారువేషాల్లో వచ్చే సిబ్బందిని ముందస్తుగా పసిగట్టి వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా లేని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మాక్‌డ్రిల్‌లో మైరెన్, కోస్ట్‌గార్డు, సివిల్ పోలీసులు 90 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, మైరెన్ సీఐ పి.లక్ష్మారెడ్డి, మైరెన్ ఎస్‌ఐలు పి.నాగశివారెడ్డి, ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మాక్‌డ్రిల్‌లో సిబ్బందికి
సూచనలిచ్చిన డీఎస్పీ