
హత్య కేసు నిందితుల అరెస్ట్
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ హిల్‌కాలనీలో వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల వద్ద హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. హత్య చేసిన వారితో పాటు హత్యతో సంబంధం కలిగిన పది మందిలో 9మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. కారు, బైకులు, కత్తులు, 10సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. బుధవారం నాగార్జునసాగర్ పోలీస్టేషన్‌లో డీఎప్పీ వివరాలు వెల్లడించారు.
వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ