
బలి చేసుకోవద్దు
డ్రగ్స్‌తో జీవితాలు
ఈగల్ టీమ్ ఎస్పీ నగేష్
ఏఎన్‌యూ(గుంటూరు): డ్రగ్స్‌తో జీవితాలు బలి చేసుకోవద్దని యువతకు పోలీస్ విభాగ ఈగల్ టీమ్ ఎస్పీ కె.నగేష్ సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్న ఏఎన్‌యూ మహోత్సవ్ 2కే25 కార్యక్రమంలో భాగంగా బుధవారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ‘ఎరాడికేషన్ ఆన్ డ్రగ్స్’ అనే అంశంపై విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ జోలికి పోరాదని సూచించారు. ఈగల్ ఎస్పీతో కలిసి వర్సిటీ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు డ్రగ్స్ ఎరాడికేషన్‌పై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామలపై స్కిట్ ప్రదర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.గోపికృష్ణ, డి. చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బలి చేసుకోవద్దు