
ఆరోగ్య సంరక్షణలో ఫార్మా కీలకం
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్
గుంటూరు మెడికల్: ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం ఎంతో కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గుంటూరు కాపిటల్ హోటల్‌లో బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫార్మాటెక్ కన్వర్ట్ –2025 కార్యక్రమానికి వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగం విశిష్టతను వివరించారు. గౌరవ అతిథి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్టు సీఈఓ పి.రవి సుభాష్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మా పాత్ర ఎంతో ఉందన్నారు. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించారు. విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ బాబు, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ, కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, బెంగుళూరు ప్రొఫెసర్ ఉషా మంజునాథ్, ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఇంద్రనీల్ సింహ, షేక్ గౌస్ షడక్, వర్మ, వీరేంద్రకుమార్, సిప్లా కంపెనీ బిజినెస్ హెడ్ ఎస్.బెనర్జి, బెంగుళూరు గవర్నింగ్ బోర్డు సభ్యుడు డాక్టర్ కేదార్ పాల్గొన్నారు.
జెడ్పీ పీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల వేతనాల్లో నుంచి మినహాయిస్తున్న నిధులు సకాలంలో జెడ్పీ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసుకు ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలోని సీఈవో చాంబర్లో జ్యోతిబసును కలిసి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు కమతం శ్రీనివాసరావు, ఎస్‌కే బాజీ, తుళ్లూరు మండల అధ్యక్షుడు దిబ్బయ్య, సీనియర్ నాయకులు సీహెచ్ శ్రీనివాస్ ఉన్నారు.