మళ్లీ వచ్చిన ఏనుగుల గుంపు
కొమరాడ: కొన్నాళ్ల పాటు జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరించిన ఏనుగుల గుంపు ఆదివారం కొమరాడ మండలం పాతదుగ్గిలో మళ్లీ సంచరిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, అరటి, కూరగాయలు తదితర పంటలు చేతిక వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో గజరాజుల గుంపు సంచారం వల్ల పంటలు నాశనమవుతాయిని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగులు తీసుకుని వచ్చి ఏనుగుల గుంపును తరలిస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ..? అంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
మొక్కజొన్న చేనులో సంచారం
ఆవేదనలో రైతులు
Comments
Please login to add a commentAdd a comment