హోటల్స్‌కు స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్
విజయనగరం అర్బన్: పర్యావరణ హితంగా పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ తెలిపారు. అందుకోసం ఘన వ్యర్థాల నిర్వహణ, మానవ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణల ఆధారంగా మూడు విధాలుగా మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో సబ్ కమిటీలు హోటల్స్‌ను తనిఖీ చేసి రేటింగ్ కోసం సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటళ్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చని అందువల్ల ఆయా హోటళ్ల ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న హోటల్స్‌ను ప్రభుత్వమే వెబ్‌సైట్‌లో పెట్టి ప్రోత్సహిస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, డీపీఓ వెంకటేశ్వరరావు, పలు హోటళ్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు, బాబూరావు కలెక్టర్‌ను పుష్పగుచ్చంతో సత్కరించారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment