అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వృత్తి పరమైన నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్ధులు ఆదిశగా కళాశాల స్థాయి నుంచి తయారు కావాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్‌ఎస్‌టీఎల్ రిటైర్డ్ సైంటిస్టు బీవీఎస్‌ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్స్‌పై నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు అధికమన్నారు. భవిష్యత్‌లో అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సావనీర్‌ను ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీఎస్‌ఎన్‌మూర్తి, ప్రొఫెసర్ కె.బాబులు, కేసీబీరావు, డాక్టర్ గురునాథం, డాక్టర్ నీలిమ, డాక్టర్ బి.హేమ, డాక్టర్ జి.అప్పలనాయుడు, జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి హాజరైన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment