కూటమి బరి తెగింపు! | - | Sakshi
Sakshi News home page

కూటమి బరి తెగింపు!

Mar 25 2025 1:41 AM | Updated on Mar 25 2025 1:36 AM

మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025

8లో

పార్టీ మారకపోతే వార్డుల్లో ఏ పనీ చేయనీయబోమని పలువురిని కూటమి నాయకులు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారన్న కారణంతో పలువురు చిరుద్యోగులను విధుల నుంచి తప్పించారు. ఇతర పనులేవీ మంజూరు చేయనీయమంటూ పలువురు కౌన్సిలర్లకు హెచ్చరి కలు జారీ చేశారు. దీంతోపాటు... పలువురికి ఇంటి స్థలం, రూ. 10 లక్షలు ఇస్తామన్న ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారన్న ప్రచారం పట్టణంలో జోరుగా సాగుతోంది. భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో గానీ.. నియోజకవర్గంలో గానీ చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ఉన్న ఉద్యోగాలను తీసివేయడమే గానీ.. కొత్తగా ఒకరిని నియమించింది లేదు. నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేసి.. ఫిరాయింపులపైనే స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించారన్న విమర్శ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫిరా యింపుల నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మా నం నోటీసు అందజేసింది. ఫలితంగా వైఎస్సార్‌సీపీకి కోరం తక్కువవుతుంది. సంఖ్యాబలం చూసుకుని, చైర్‌ పర్సన్‌ సీటు కోసం కూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న కౌన్సిలర్లపై స్థానిక ఓటర్లు ఇప్పటికే మండిపడుతున్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో కలిసి వెన్నుపోటు రాజకీయాలకు తెరతీయడంపై గుర్రుమంటున్నారు. తిరిగి మాతృపార్టీకి వస్తారా.. లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగుతారా అన్న చర్చ పట్టణవాసుల్లో సాగుతోంది.

26న ఇ–అడ్వాన్స్‌ టెండర్లు

సీతంపేట:ఇ–అడ్వాన్స్‌ టెండర్లను ఈనెల 26న నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. 5వేల కొండచీపుర్లు, 100 క్వింటాళ్ల కుంకు డు, 100 క్వింటాళ్ల పసుపు కొమ్ముల విక్రయానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలకు జీసీసీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

గవరమ్మపేటలో ఏనుగుల గుంపు

జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపే ట, వెంకటరాజపురం పంట పొలాల్లో సోమవా రం ఏనుగులు దర్శనమిచ్చాయి. వెంకటరాజపురంలోని బంటు అప్పలనాయుడు, దత్తి వెంకటనాయుడు, బంటు గౌరునాయుడుకు చెంది న జొన్న, అరటి తోటలు ధ్వంసం చేశాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

పకడ్బందీగా

ఏపీపీఎస్‌సీ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో మంగళ, బుధవారాల్లో జరగనున్న ఏపీపీఎస్‌సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో సంబంఽధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. 25న అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌, 25, 26వ తేదీల్లో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో అనలిస్ట్‌ గ్రేడ్‌–2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీ సర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎంవీజీఆర్‌ కళాశాల, అయాన్‌ డిజిటల్‌, లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ లక్ష్మణరావు, పరీక్షల సూపరింటెండెంట్‌ భాస్క రరావు, ఏపీపీఎస్‌సీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.బాలరాజు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కె.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో మ్రెరిట్‌ జాబితా

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య కళాశాల్లో స్పీచ్‌ థెరపిస్టు, ఓటీ టెక్నీషియన్‌, డెంటల్‌ టెక్నీషియన్‌ పోస్టుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా వెబ్‌ సైట్‌లో పెట్టామని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల సోమవారం తెలిపారు. అభ్యంతరాలుంటే వైద్య కళాశాలలో ఏప్రిల్‌ ఒకటో తేదిలోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

కూటమి నాయకులు బరి తెగించారు. అధికా ర దర్పంతో అడ్డదారులు తొక్కారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్వతీపురం మున్సిపాలిటీ లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లే లక్ష్యంగా ప్రలోభాల పర్వానికి దిగి.. నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ కుర్చీపై కన్నేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ... దానిపై తమవారిని కూర్చోబెట్టేందుకు అన్ని దా రులూ వెతికారు. ఒక్కొక్కరినీ తమ పార్టీల్లోకి లా క్కొన్నారు. చివరిగా సోమవారం ఉదయం మరో ఇద్దరిని కలిపేసుకుని, సాయంత్రం ఆగమేఘాలపై జేసీ ఎస్‌.ఎస్‌.శోభికను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. కొద్దిరోజుల కిందట పాలకొ ండ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అస్త్రశ స్త్రాలన్నీ ఉపయోగించారు. స్వయంగా కూటమి పార్టీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బరిలో దిగారు. అయినప్పటికీ..పాలకొండ నగర పంచాయతీకి చెందిన కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ పట్ల తమ విశ్వాసాన్ని చూపుకొన్నారు. ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా వెరవలేదు. దీంతో కూటమి ఎత్తులు చిత్తయ్యాయి.

విశ్వాసంపై నీళ్లు చల్లి.. అవిశ్వాసం

పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా 18వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ బోను గౌరీశ్వరి కొనసాగుతున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారు. బీజేపీ ఒక స్థానం, ఇద్దరు స్వతంత్రులు ఎన్నికల బరిలో గెలవగా.. 22 స్థానా ల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో 10, 19, 26వ వార్డులను అప్పటి ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఏకగ్రీవం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లే లక్ష్యంగా.. ప్రలోభాలకు తెర తీశారు. అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్‌, పదిమంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్నారు. తాజాగా ఒకటో వార్డు స్వతంత్ర కౌన్సిలర్‌ ఆర్‌.శివకుమార్‌ (బంగారునాయుడు), వైఎస్సార్‌సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్‌ రణభేరి చిన్నంనాయుడును టీడీపీలో చేర్చుకున్నారు. వాస్తవానికి ఒకటో వార్డు కౌన్సిలరు శివకుమార్‌ గెలిచిన వెంటనే బీజేపీలోకి జంప్‌ అయ్యారు. తర్వాత వైఎస్సార్‌సీపీలోకి, అనంతరం టీడీపీలోకి గోడ దూకారు. మరలా కొద్దిరోజుల తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరగా.. తాజాగా మరోసారి పార్టీ మారి, టీడీపీ కండువా కప్పుకున్నారు.

కూటమిది అడ్డదారి!

తమ దారి అడ్డదారి అని కూటమి నాయకులు మరోసారి నిరూపించుకున్నారు. ఓటర్లు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీజేపీ, స్వతంత్రులు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో కలుపుకున్నారు. దీంతో కూటమి బలం 18కి చేరింది. ఎప్పటి నుంచో చైర్‌పర్సన్‌ కుర్చీపై తమ వారిని కూర్చోబెట్టేందుకు తహతహలాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర.. నిమిషమైనా ఆలస్యం చేయకుండా సోమవారం సాయంత్రమే జేసీ శోభికను కలసి అవిశ్వాస తీర్మానం నోటీసు దగ్గరుండి అందజేశారు. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ బీఫారంతో గెలిచిన పలువురు కౌన్సిలర్లు.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో పలువురిపై వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది.

పార్వతీపురం రూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్స్‌కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, బెట్టింగ్‌లకు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌ రెడ్డి హెచ్చరించారు. తన కార్యాలయంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల వలలో చిక్కుకు ని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితవుపలికారు. బెట్టింగ్స్‌ పెను భూతం వంటివని, ఆశచూపి అథఃపాతాళానికి నెట్టివేస్తాయన్నారు. డబ్బులు పోగొట్టు కున్న అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటను ఉదహరించారు. క్రికెట్‌ వినోదం కోసమే చూడాలే తప్ప బెట్టింగ్‌ల వైపు మొగ్గు చూపకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలోనుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.

అనుమానితులపై నిఘా

పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారు, అనుమానితులపై పోలీస్‌ నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌ లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే 112/100కు డయల్‌ చేయాలని లేదా సమీపంలో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

న్యూస్‌రీల్‌

ప్రలోభాలు.. బెదిరింపులు

పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠంపై ఎమ్మెల్యే కన్ను

భయపెట్టి.. ప్రలోభపెట్టి కౌన్సిలర్లకు ఎర

ఇంటి స్థలం, రూ.10 లక్షలకు

బేరమంటూ ప్రచారం

అధికార దర్పంతో అడ్డదారులు

జేసీ శోభికకు అవిశ్వాస తీర్మానం నోటీసు

కూటమి బరి తెగింపు! 1
1/4

కూటమి బరి తెగింపు!

కూటమి బరి తెగింపు! 2
2/4

కూటమి బరి తెగింపు!

కూటమి బరి తెగింపు! 3
3/4

కూటమి బరి తెగింపు!

కూటమి బరి తెగింపు! 4
4/4

కూటమి బరి తెగింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement