
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ బిగ్ ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని కాషాయ పార్టీ ముఖ్య నేతలు వరుస సమావేశాలు అవుతూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్టీరింట్ కమిటీతో, మధ్యాహ్నం తర్వాత జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇంచార్జ్‌లతో సునీల్ బన్సాల్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా బన్సాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఇంఛార్జ్‌లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని తెగేసి చెప్పారు సునీల్ బన్సాల్. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న అసెంబ్లీ ఇంఛార్జ్‌లు.. తమను ఇంఛార్జ్‌ల స్థానం నుంచి తొలగించాలని బన్సల్‌ను కోరారు. దీంతో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. వెంటనే కలుగజేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆరు నెలల పాటు ఇంఛార్జ్‌లు పనిచేయాలని సూచించారు. ఆరు నెలల తర్వాత సొంత నియోజకవర్గాల్లో పని చేసుకునే అవకాశం కల్పిస్తామని సంజయ్ సర్ధిచెప్పినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment