ముంబై: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. శనివారం నాగ్‌పూర్‌లో జర్నలిజం అవార్డుల వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రధాని రేసులో ఉంటే నేను మీకు మద్దతు పలుకుతాను అంటూ ఓ నేత తనతో చర్చలు జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. ‘నాకు ఓ సంఘటన గుర్తుంది. ఆ నేత పేరు చెప్పలేను. మీరు ప్రధాని రేసులో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు.
అందుకు తాను మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి? నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నించినట్లు చెప్పారు. అంతేకాదు, తనకు ప్రధాన మంత్రి కావడమే నా జీవిత లక్ష్యం కాదు. నేను విశ్వాసానికి, బీజేపీకి విధేయుడిని. దాని కోసం నేను రాజీపడను. ఏ పదవి అయినా నాకు అత్యంత ప్రధానమైందని సదరు నేతతో చెప్పినట్లు గడ్కరీ అన్నారు.
ఇదీ చదవండి : బెంగళూరు కర్ణాటకలో ఉందా.. పాకిస్థాన్‌లో ఉందా?
Comments
Please login to add a commentAdd a comment