
ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి తన దురుసు వ్యాఖ్యలతో వివాదంలో చిక్కకున్నారు. రోజు చేపలు తింటే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు. నందుర్బార్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ మాట్లాడుతూ.. రోజూ చేపలను తినే వ్యక్తుల చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని అన్నారు. తమ వైపు ఎవరూ చూసిన వెంటనే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో ‘ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ.. ? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్ లాగే అందంగా తయారవుతాయి. చేపలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.’ అని మంత్రి చెప్పారు.
అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ మండిపడ్డారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ‘నేను రోజు చేపలు తింటాను. నా కళ్లు కూడా అలాగే ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అనే విషయంపై మంత్రిని ప్రశ్నిస్తానని’ చెన్నారు.
చదవండి: స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
म्हणून ऐश्वर्या रॉयचे Aishwarya Rai डोळे आणि त्वचा सुंदर आहे - आदिवासी विकास मंत्री VijayKumar Gavit#vijaykumargavit #aishwaryaraibachchan #aishwaryarai #adiwasi #maxmaharashtra@AishwaryaWeb @DrVijayKGavit pic.twitter.com/2kFhmgSRBk
— Max Maharashtra (@MaxMaharashtra) August 21, 2023
Comments
Please login to add a commentAdd a comment