క్రజ్ సిల్వా, వెంజీ విగాస్
Goa Assembly Election 2022 Results: పంజాబ్‌లో ఘన విజయం సాధించి దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవాలో బోణి కొట్టింది. పర్యాటక రాష్ట్రం గోవాలో రెండు స్థానాలను గెల్చుకుంది. బెనాలియ్, వెలిమ్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. బెనాలిమ్ స్థానం నుంచి కెప్టెన్ వెంజీ విగాస్ గెలుపొందారు. క్రజ్ సిల్వా.. వెలిమ్ సీటును కైవసం చేసుకున్నారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమ పార్టీ అభ్యర్థుల విజయంతో గోవాలో నిజాయితీ రాజకీయాలకు శ్రీకారం చుట్టామని ట్వీట్ చేశారు.
బెనాలిమ్ నియోజకవర్గంలో కెప్టెన్ వెంజీ విగాస్‌కు 6267 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి అయిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చర్చిల్ అలెమావోకు 4996, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనియో ఫెలిసియానోకు డయాస్ 4609 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దామోదర్ (సమీర్) బందోద్కర్‌కు కేవలం 821 ఓట్లు మాత్రమే దక్కించుకున్నాయి.
వెంజీ విగాస్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన క్రజ్ సిల్వాకు 5279 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి డిసిల్వా సావియోకు 5067 ఓట్లు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బెంజమిన్ సిల్వా 4039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సావియో రోడ్రిగ్స్ కు 1312 ఓట్లు వచ్చాయి. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్)
Comments
Please login to add a commentAdd a comment