సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఆది వారం బీజేపీకి సంబంధించి రెండు ము ఖ్యమైన సమావేశా లు జరగనున్నాయి. ఈ భేటీల్లో పార్టీ పరంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు, ప్రచార వ్యూహం, లేవనెత్తా ల్సిన అంశాలు, లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న భేటీలో... పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం విడిగా రాష్ట్రపార్టీ ముఖ్యనేతల సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్ ఇతర నాయ కులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతోపాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment