ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం బీరెన్ సింగ్(ఫైల్ ఫొటో)
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలి ఫేజ్ ఎన్నికల్లో 38 స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తొమ్మిది చోట్ల రీ పోలింగ్ డిమాండ్ వినిపిస్తోంది ఇప్పుడు.
తొమ్మిది చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల అధికారులు, ఈసీకి ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో అనే ఆసక్తి నెలకొంది. చురాచంద్‌పూర్ జిల్లాలోనే ఈ తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ అల్లర్లు చోటు చేసుకోవడంతో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు, పోలింగ్ ఆఫీసర్లు.. ఈసీని కోరుతున్నారు.
తొమ్మిదిలో ఏడు పోలింగ్ స్టేషన్‌లలో ఈవీఎంల డ్యామేజ్‌ల ఘటనలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే జిల్లాలోని తిపయ్‌ముఖ్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల విధులు నిర్వహించిన పోలీస్ అధికారి నావోరెమ్.. అనుమానాదాస్పద స్థితిలో సర్వీస్ తుపాకీ పేలి చనిపోయిన ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఈవో వెల్లడించారు. అభ్యర్థుల దాడులపైనా ఒక ఫిర్యాదు నమోదు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment