సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాపం పండిందని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, అన్‌స్కిల్డ్ పొలిటీషియన్ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన హయాంలో అన్నీ స్కాములేనని విమర్శించారు.
ప్రజాధనాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రాబు వాడుకున్నారని మంత్రి అమర్నాథ్ దుయ్యబట్టారు. షెల్ కంపెనీలతో ఎంవోయూలు అంటూ డ్రామా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చెప్పిన ఏ కంపెనీ రాష్ట్రానికి రాలేదని అన్నారు. తాను చేసిన దోపిడీకి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: చంద్రబాబే ప్రధాన సూత్రధారి: ఏపీ సీఐడీ
చంద్రబాబుకు శిక్ష తప్పదు
ఐటీ నోటీసుల కేసులో ఇద్దరు నిందితులను దుబాయ్, అమెరికాకు పంపించేశారన్న మంత్రి.. చంద్రమండలంపై ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాయన్నారు. చేసిన తప్పులకు అరెస్ట్ చేయకుండా మరేం చేస్తారని ప్రశ్నించారు. నైపుణ్యావృద్ధి పేరిట యువతను నిలువునా మోసం చేశారని, చేసిన తప్పులకు చంద్రబాబుకు శిక్ష తప్పదని మండిపడ్డారు. చంద్రబాబు సానుభూతి రాజకీయాలను ప్రజలను నమ్మరు.
పురంధేశ్వరికి చట్టం కంటే చంద్రబాబే ముఖ్యం
చంద్రబాబు కనుసన్నల్లోనే స్కిల్ స్కామ్ జరిగింది. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయారు. పురంధేశ్వరికి చట్టం కంటే చంద్రబాబే ముఖ్యం. కంద్రబాబు అవినీతిపై పవన్, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడరు. ఎంత క్రిమినల్ స్కిల్ లేకుంటే ఇలాంటి ఐడియా వస్తుంది. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది.’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టుపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవించక ఎప్పుడైనా తప్పదని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎవడు చేసిన కర్మ వాడనుభవించక
— Ambati Rambabu (@AmbatiRambabu) September 9, 2023
ఎప్పుడైనా తప్పదన్నా ! @ncbn @naralokesh
Comments
Please login to add a commentAdd a comment