
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు పొదుపు సంఘాల మహిళల అప్పులను నాలుగు దశల్లో తీర్చే వైఎస్సార్ ఆసరా పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బాధల్ని పంచుకున్న ప్రియతమ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.
అదే సమయంలో ఎప్పటిమాదిరిగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పసలేని విమర్శలతో మరింత పలచనవుతున్నారు. ఈక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘చంద్రం..మళ్ళీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? సీఎం జగన్ గారు శ్రీకారం చుట్టిన ''‘వైఎస్సార్ ఆసర' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా? కానీ మీ కుట్ర విఫలం.‘వైఎస్సార్ ఆసర' సఫలం. మళ్ళీ వినండి..మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జగన్ గారు జమ చేశారు’అని పేర్కొన్నారు.
(చదవండి: ఇంటింటా ఆధునిక మహిళ)
Comments
Please login to add a commentAdd a comment