సాక్షి, విజయవాడ:
నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి టీడీపీని ఆహ్వానించినట్లు వచ్చినట్లు వార్తలను BJP నేత మాధవ్ ఖండించారు. NDA కూటమికి TDPని ఆహ్వానించలేదని స్సష్టం చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆహ్వానం పంపించామని తెలిపారు. ఏపీలో తమ పొత్తు జనసేనతోనేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీతో పొత్తుపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని. జూ. ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు.
NDA మిత్ర పక్షాల సమావేశానికి టీడీపీకి మేము ఆహ్వానం పలకలేదు.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు -- బీజేపీ నేత మాధవ్.... pic.twitter.com/JqOuaihJrI
— Narayana Raju (@NarayanYsr) July 7, 2023
అసలేం జరిగింది?
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ.. సారూప్యత ఉన్న మిత్ర పక్షాలను దగ్గరికి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. జులై 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. గతంలో ఎన్డీయే కూటమిలో ఉండి, రకరకాల కారణాలతో దూరమైన పార్టీలను పిలవాలని, స్వల్ప అభిప్రాయ బేధాలను పట్టించుకోవద్దని భావించింది.
పచ్చ పార్టీ ఏం చేసింది
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈ పరిస్థితిని అందివచ్చిన అవకాశంగా మార్చుకోవాలనుకున్నారు. ఎల్లో మీడియాతో పాటు తమకు అనుకూలంగా ఉన్న మరికొన్ని సైట్లలో వార్తలు గుప్పించారు. అదిగో ఆహ్వానం.. ఇదిగో చంద్రబాబు సూట్ కేస్ సర్దుకుంటున్నారన్నట్టుగా వార్తలు కుమ్మేశారు.
SAD, TDP, JD(S) likely to attend NDA meet in Delhi on July 18#NDA #2024Elections https://t.co/44YrV8b9CD
— Argus News (@ArgusNews_in) July 7, 2023
కమలం వైఖరేంటీ?
ఏపీలో ప్రధాన పార్టీలు మూడు YSRCP, టీడీపీ, జనసేన. వీటిలో జనసేనతో అధికారికంగానే పొత్తు పెట్టుకున్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నట్టు BJP గమనించింది. ఈ విషయంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ప్రధాని నుంచి క్లారిటీ కూడా వచ్చిందని జనసేన వర్గాలే చెప్పుకుంటున్నాయి.
తెలుగుదేశం సంగతేంటీ?
2014లో వెంటపడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్ కు చేరువయిన చంద్రబాబు.. రాహుల్ తో జట్టు కట్టి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానంటూ ముందుకు కదిలారు. 2018లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుని భయంకరమైన పోరాటం నిర్వహించారు చంద్రబాబు.
2019లో ఏం జరిగింది?
2019లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అత్యంత ఘోర పరాజయం చవి చూసింది. ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు ఉంటే.. YSRCP 151 ఎమ్మెల్యే సీట్లు, 22 లోక్ సభ సీట్లు గెలుచుకుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని, దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమం నిర్వహించిన చంద్రబాబు అసెంబ్లీలో 23 సీట్లు, పార్లమెంటులో 3 సీట్లతో చతికిలబడ్డారు. ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ చంద్రబాబు చేపట్టాడు చంద్రబాబు. నీతి నియమాలను, రాజకీయ కట్టుబాట్లను గాలికి వదిలేసి ఏకంగా YSRCPకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. కొందరికి మంత్రి పదవులు కూడా కట్టుబెట్టాడు. తనతో పాటు, ఫిరాయించిన వారి రాజకీయ భవితవ్యాన్ని గోదావరిలో కలిపేసి చేతులు దులుపుకున్నాడు చంద్రబాబు.
చంద్రబాబు చేసిన ఘనకార్యమేంటీ?
అపాయింట్ మెంట్లు ఇవ్వకున్నా కోల్ కతా నుంచి ఢిల్లీ దాకా గడప గడపకు తిరిగి బీజేపీ వ్యతిరేక ఉద్యమం చేశారు చంద్రబాబు. ఢిల్లీలో భారీ ఆందోళన నిర్వహించి ప్రధాని మోదీని, ఆయన భార్యను పట్టించుకోలేదంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. హోంమంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చి శ్రీవేంకటేశ్వరుడి దర్శనం చేసుకుని వెనక్కువస్తుండగా తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పులు, రాళ్లతో దాడులు చేయించిన ఘనత చంద్రబాబుదే.
ఇప్పటి రాజకీయ సమీకరణాలేంటీ.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మళ్లీ రంగు మార్చారు. బీజేపీలోకి తన పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురిని ఎక్స్ పోర్ట్ చేసి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. వారితో పాటు పార్టీలో ఉన్న మరికొందరికి కమలం కండువా కప్పి మరీ సాగనంపారు. ఇన్ని చేసినా బీజేపీకి దగ్గరయ్యే ఏ ప్రయత్నంలోనూ సఫలీకృతం కాలేకపోయారు చంద్రబాబు. దీంతో ఏదైనా అవకాశం దొరికితే మళ్లీ ఎన్డీఏలోకి చొరబడుదామని సిద్ధంగా ఉన్నారు బాబు.
భేటీపై ఆశలెందుకు?
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం జరిగింది. పురంధేశ్వరీ ఎవరో కాదు.. చంద్రబాబు భార్య భువనేశ్వరీకి స్వయంగా సోదరి. పురంధేశ్వరీ ద్వారా ఎలాగైనా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాలన్నది చంద్రబాబు వ్యూహాంగా కనిపిస్తోంది. అందుకే అదిగో ఆహ్వానం.. ఇదిగో చంద్రబాబు అన్నట్టుగా కొన్ని వార్తలను వండి వార్చేశారు. ఎన్డీఏ కూటమికి దూరమైన పాత మిత్రులంతా వచ్చేస్తున్నారంటూ కలరింగ్ ఇచ్చేశారు. ఇటు జాతీయ మీడియాలోనూ తనకు అనుంగు మిత్రులైన కొందరితో వార్తలు రాయించుకుని కాసింత బిల్డప్ క్రియేట్ చేసింది టిడిపి.
Big NDA meet will take place in Delhi's Hotel Ashoka on July 18. From Chirag Paswan to Sukhbir Badal, top leaders to attend 'Super NDA' meet.#NDAPlus #LJP #TDP #AkaliDal #NewDelhi #SuperNDA
— Republic (@republic) July 6, 2023
WATCH #LIVE here-https://t.co/5C8MAHsMNQ pic.twitter.com/gZBqemrF83
(జాతీయ మీడియాలో టిడిపికి అనుకూలంగా రిపబ్లిక్ చేసిన ట్వీట్, ఇందులో BJP మిత్రులతో పాటు TDPని టాగ్ కూడా చేసింది)
తాజాగా బీజేపీ నేత మాధవ్ టిడిపి గురించి స్పందించడంతో .. టిడిపి ప్రచారానికి బ్రేక్ పడ్డట్టయింది.
చదవండి: బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఛేంజ్.. మోదీ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment