ఇంపాల్: మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరో ఆరు రోజుల్లో మొదటి దశలో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ప‍్రచారంలో జోరు పెంచింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇంపాల్‌లోని లువాంగ్‌సంగ్‌బామ్ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని వస్తున్న మార్గంలో బీజేపీ మహిళా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
భారత్ మాతా కీ జై, మోదీ జీకి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్‌లో నుంచి అక్కడున్న మహిళలకు కరచాలనం అందించారు. వారితో ముచ్చటించారు. ఈ వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మణిపూర్‌లో విలువైన క్షణాలు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ప్రధాని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఫిబ‍్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది.
Precious moments in Manipur. Grateful for the affection… pic.twitter.com/ERopqqtVbg
— Narendra Modi (@narendramodi) February 22, 2022
Comments
Please login to add a commentAdd a comment