సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను కందిపప్పు లాంటివాడినని, ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారని, తింటే చస్తారని విమర్శించారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోవాలని, గన్నేరు పప్పును కాదని చురకలంటించారు.ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్‌ఎస్ పాలన ఉందని విమర్శించారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో త్యాగాలు గుర్తుచేసేలా కాకుండా, రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలను అడిగితే బాగా చెబుతారన్నారు. తెలంగాణ మాములుగా ఏర్పడలేదని, రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారని తెలిపారు.
‘తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటాం. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేశాం. ఆంధ్రలో పార్టీ సర్వం కోల్పోయినా.. న్యాయం ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియా. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని ఇవ్వలేదు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారింది. ప్రజా సంఘాలకు, అఖిలపక్ష నేతలకు ప్రాధాన్యత లేదు. అసెంబ్లీ హాల్‌లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చారు. మీడియాపై ఆంక్షలు పెట్టారు. సచివాలయంలో కూడా ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నారు.
అపోజిషన్ లీడర్లకు అనుమతి ఉండదా? ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేది. నియంత కంటే ఎక్కువగా వుంది కేసీఆర్ పాలన. నియంత కాదు క్రిమినల్ పొలిటిషన్. కోట్లాది సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది అర్ధం కావడం లేదు. నిరుద్యోగులు ఇంటికి పోకుండా దాపరించింది. మేడిగడ్డ కుంగింది, అన్నారం పలిగింది. నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టారు. టీఎస్‌పీఎస్సీ నిరుద్యోగులను ఆగంచేసింది.
కేసీఆర్ ఇచ్చిన చాలా మాటలు అమలు కాలేదు. మోసం చేసిన ద్రోహిణి తన్ని తరమాలి. తెలంగాణ దేశానికే ఆదర్శం అన్నారు. ఇప్పుడేమో కర్ణాకకలో ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారు. మరి బీజేపీ గెలవాలా? అంటే బిజెపి బిఆర్ఎస్ ఒక్కటే అని మేము అంటున్నాం. పక్క ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకొస్తుంది. 2050 ప్రణాళికతో ముందుకొస్తున్నాం. కేసీఆర్ గురించి మేము ఏమి చెప్పనవసరం లేదు. కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. చివరికి జర్నలిస్టులను కూడా ఆగం చేశారు’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
LIVE: TPCC President Sri Revanth Reddy Meet The Press at TUWJ || Revanth Reddy
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2023
https://t.co/A5Jhhqf6WF
Comments
Please login to add a commentAdd a comment