
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(63) చరిత్ర సృష్టించారు. గురువారంతో సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగిన బీజేపీ నేతగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ ఘనత ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పేరిట ఉంది.
రమణ్ సింగ్ మూడు పర్యాయాలు వరసగా సీఎం పదవిని అధిష్టించి 15 ఏళ్ల 10 రోజులపాటు కొనసాగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటిసారిగా 2005 నవంబర్‌లో సీఎం అయ్యారు. 2008, 2013 ఎన్నికల్లో పార్టీని గెలిపించారు.