
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబుపై శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు స్క్రిజోఫీనియా ముదిరిపోయిందని వ్యాఖ్యానించారు. అల్జీమర్స్ ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు నాయుడు తనను తాను పూర్తిగా మర్చిపోయాడు.. ఇప్పుడు తాను జడ్జ్ పాత్రలో ఊహించుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్ లో తీర్పు కూడా ఇచ్చాడు. పాపం..ఎవ్వరు ఏం అనొద్దు’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment