సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన.. ‘పాతికేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు తాను ఎలా సీఎం అయ్యాడో చెప్పుకోలేని స్థితిలో ఉన్న చంద్రబాబు..మొత్తంగా ఈ దేశంలో వ్యవస్థల పతనానికే నిలువెత్తు రూపం. ఎన్టీఆర్ టీడీపీకి బాబు సమాధి కడితే, బాబు టీడీపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు సమాధి కట్టారు.’అంటూ విరుచుకుపడ్డారు. (‘విమ్స్ ఎప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే’)
మరో ట్వీట్‌లో ‘చంద్రబాబు..వెన్నుపోటుతో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠంలో కూర్చొని, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, ఇంకొన్ని వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ, డర్టీయస్ట్ పొలిటిషియన్‌గా, చివరికి రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురై, వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు.. సిల్వర్ జూబ్లీ విషెస్.’ అంటూ విమర్శలు గుప్పించారు. (చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల)
Comments
Please login to add a commentAdd a comment