![కోటిరెడ్డి(ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/17mrkp108-260010_mr_0.jpg.webp?itok=2Fg7vhMy)
కోటిరెడ్డి(ఫైల్)
పొదిలి: రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన దర్శిలోని పెట్రోల్ బంకు సమీపంలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని ఈగలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ మేడం కోటిరెడ్డి(57) గురువారం రాత్రి పొదిలి నుంచి ఈగలపాడు మోటారు సైకిల్‌పై వెళుతుండగా దర్శి రోడ్డులోని ఎస్‌ఆర్ పెట్రోల్ బంకు వద్ద లారీ డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పోలేరమ్మ పొంగళ్లకు ఆహ్వానించి వెళుతూ..
గ్రామంలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పొదిలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుండగా, అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కేపి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ నాయకులను కార్యక్రమానికి ఆహ్వానించిన పది నిముషాలు గడవక ముందే మృత్యువాత పడటం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోటిరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment