
వీరబ్రహ్మేంద్ర స్వామికి బూచేపల్లి, సురేష్ పూజలు
కొండపి:
విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా ఆదివారం జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మండల నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, ఆనందోత్సవాలతో గడపాలన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చి రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జాళ్లపాలెం గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, గ్రామ సర్పంచ్, భువనగిరి సత్యనారాయణ, నియోజకవర్గ పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడు షేక్ వన్నూరు, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధర్, మండల సీనియర్ నాయకులు బొక్కిసం సుబ్బారావు, బచ్చల కోటు, వాకా శ్రీకాంత్ రెడ్డి రవీంద్రారెడ్డి, బ్రహ్మయ్య కార్తీక్, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.