
పోక్సో కేసు నమోదు
కొండపి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు నమోదైనట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. కొండపి మండలంలోని కే ఉప్పలపాడులో ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పచ్చాకు పనుల నిమిత్తం ముండ్లమూరు మండలం నుంచి కే ఉప్పలపాడు వచ్చిన కూలీలకు చెందిన బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుని ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి కొండపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విచారించి పోక్సో కేసు నమోదు చేశారు. రెండు నెలలుగా ఇలా జరుగుతుండగా, బాలిక భయపడి బయటకు చెప్పలేదని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు. విచారణలో కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.