చందుర్తి జీపీలో విచారణ
● అక్రమ నిర్మాణంపై పలు ఫిర్యాదులు ● కొలతలు తీసి వెనుదిరిగిన అధికారులు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలోని అక్రమ కట్టడంపై గురువారం చేపట్టిన విచారణ గందరగోళంగా మారింది. ఫిర్యాదుదారులు, నిర్మాణదారుల మధ్య వాగ్వాదంతో ఉద్రికత్త నెలకొంది. చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్రభుత్వ బోరును ఆక్రమిస్తూ రేకులషెడ్ వేశారంటూ ఈనెల 17న అదే గ్రామానికి చెందిన కోన శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారుల ఆదేశాలతో గురువారం చందుర్తి జీపీలో ఎంపీడీవో ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలు డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై అదే వార్డు వాసులు 14 మంది సభ్యులు సంతకాలు చేయడంపై ఆరా తీశారు. అయితే ఫిర్యాదుదారుడు చెబితే నమ్మి సంతకాలు పెట్టామని, ఫిర్యాదులో ఏముందో తమకు తెలియదని పేర్కొన్నారు. వెంటనే ఫిర్యాదుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో ఆ రేకులషెడ్ వద్ద కొలతలు తీసి అధికారులు వెనుదిరిగారు. ఈ విచారణలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఫిర్యాదుదారులు, నిర్మాణాదారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment