ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ : నేటి నుంచి జిల్లాలో పోలీసు అమరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్‌డే) దిన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలో పోలీస్ అమరుల ప్రాణత్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరుల సంస్మరణ దిన ‘పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
● ఆన్‌లైన్‌లో పోటీలు
విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషాల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నాం. ఇంటర్ విద్యార్థులకు విచక్షణతో కూడిన మొబైల్ వాడకం, డిగ్రీ, పీజీ విద్యార్థులకు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశాలపై ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి బహుమతుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం.
● పోలీసులకు సైతం
కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి అధికారి వరకు సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర, ఎస్.ఐ స్థాయి, పై స్థాయి అధికారులకు దృఢమైన శరీరంలో దృఢమైన మనసు అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాం. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుంది.
● రక్తదాన శిబిరాలు
సైకిల్ ర్యాలీతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాం. యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అమరులను స్మరిస్తూ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తారు.
● కళాబృందాల ప్రదర్శనలు
నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని పలు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందంతో పాటలు పాడే కార్యక్రమాలు ఉంటాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ అమరుల బ్యానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment