ఆస్తి వివాదం.. ఆగిన అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

ఆస్తి వివాదం.. ఆగిన అంత్యక్రియలు

Published Wed, Oct 23 2024 7:34 AM | Last Updated on Wed, Oct 23 2024 12:20 PM

-

మనస్తాపంతో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఐదురోజులుగా ఆస్పత్రిలోనే మృతదేహంతో ఆందోళనలు

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకుడు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్‌, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్‌ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్‌ మల్లేశం పేరుపై సెల్‌ డీడ్‌ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్‌ గౌడ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement