మెదక్ ఆర్డీవో రమాదేవి
మండల కేంద్రంలోని ఎంజేపీలో జెండాలు పాతుతుండగా ప్రమాదం
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో నలుగురు విద్యార్థినులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (ఎంజేపీ) బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో మంగళవారం ఉదయం విద్యార్థినులు రజిత, గాయత్రీ, వసంత, తనుష్క క్రీడా జెండాలను పాతుతున్నారు.
పైన 11 కేవీ విద్యుత్ వైర్లను గమనించపోవడంతో ఇనుప రాడ్ తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో విద్యార్థినులు చెల్లా చెదురుగా పడిపోయారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థినులు హుటాహుటినా మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీవో రమాదేవితోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి విద్యార్థినులను ఆస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థినులతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆర్డీవో కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment