జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్, ఉషు విభాగంలో ఎంపిక
హత్నూర(సంగారెడ్డి): జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్, ఉషు విభాగంలో హత్నూర మండలం సిరిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి మద్దూరి హరిప్రసాద్, ఎనిమిదో తరగతి విద్యార్థిని కాలే నాగేశ్వరి ఎంపికయ్యారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 4 వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఫైటింగ్ విభాగంలో హరిప్రసాద్ బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఈనెల 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లా హస్తినాపూర్‌లో జరిగిన ఉషు అండర్–14 విభాగం రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో నాగేశ్వరి విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఇదే నెలలో పంజాబ్‌లో జరిగే పోటీలో కాలే నాగేశ్వరి, డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగే పోటీల్లో హరి పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment