సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన 12 ఏళ్ల శివరాంసాయి. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. గతేడాదిన్నరగా సోషల్ మీడియాలో సిద్దిపేట చిచ్చా పేరిట శివరాంసాయి తన రీల్స్ ద్వారా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో సిద్దిపేట చినోళ్లు పేజీ పేరిట చేస్తున్న రీల్స్‌కు 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లోను ఆదరణ ఉంది. సిద్దిపేట పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా రీల్స్ చేస్తున్నాడు. హోటల్స్, బిర్యానీ పాయింట్లు, షాపింగ్ మాల్స్, వివిధ రకాల దుకాణాలకు తన రిల్స్ ద్వారా ప్రకటనలు చేస్తున్నాడు.