గిరిజన బాలికల వసతిగృహంలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి వెల్లడి
నారాయణఖేడ్: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పేద విద్యార్థులకోసం నియోజకవర్గానికో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఖేడ్‌లోని గిరిజన బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో కలసి ఆయన కేకును కట్ చేశారు.
ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ 40% డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. విద్యారంగంలో జిల్లాలో నారాయణఖేడ్‌ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, నెహ్రూనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment