శుభకార్యానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
కొండాపూర్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్‌ఐ హరీశ్ కథనం మేరకు.. మారేపల్లి గ్రామానికి చెందిన గంజాయి ప్రకాశ్ (28) బంధువుల శుభకార్యం నిమిత్తం మూడు రోజుల కిందట మండల పరిధిలోని మల్కాపూర్‌కు వచ్చాడు. బుధవారం ఉదయం కార్యక్రమం కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు బైక్‌పై బంధువైన జేమ్స్‌తో కలిసి సంగారెడ్డికి వచ్చాడు. తిరిగివెళ్తున్న క్రమంలో మల్కాపూర్ గ్రామ శివారు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు గంజాయి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
న్యాల్‌కల్(జహీరాబాద్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హుస్సెళ్లి చెక్ పోస్టు వద్ద చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శంశల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభు(31) మంగళవారం రాత్రి హుస్సెళ్లి చౌరస్తా నుంచి కాలి నడకన ఇంటికొస్తున్నాడు. చెక్ పోస్టు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పున్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైకును ఢీకొట్టిన డిప్పర్: యువకుడు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment